Notifications14th Dec 10:12 AMSunil Byrisetty1 min read
నిరుద్యోగులకు ఆర్ఆర్బీ గుడ్ న్యూస్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి వార్షిక రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ వార్షిక క్యాలెండర్ ప్రకారం 2026 ప్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి వార్షిక రిక్రూట్‌మెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ వార్షిక క్యాలెండర్ ప్రకారం 2026 ప్రారంభం నుంచే నోటిఫికేషన్ల వరుస మొదలుకానుంది. ఫిబ్రవరి నెలలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి నెలలో టెక్నీషియన్ విభాగాల్లో ఉన్న వేల సంఖ్యలో ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పోస్టులు ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు ప్రత్యేకంగా ఉపయోగపడనున్నాయి.
ఏప్రిల్ నెలలో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు.
జూలై నెలలో పారామెడికల్ స్టాఫ్‌తో పాటు జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
ఆగస్టు నెలలో అత్యంత క్రేజ్ ఉన్న నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) నోటిఫికేషన్ వెలువడనుంది. సెప్టెంబర్ నెలలో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీల పోస్టుల భర్తీ జరగనుంది.
అక్టోబర్ నెలలో భారీ స్థాయిలో అభ్యర్థులు ఎదురుచూసే గ్రూప్-డీ (లెవల్-1) పోస్టుల నోటిఫికేషన్ విడుదల కానుంది.