News27th Dec 03:23 PMSunil Byrisetty1 min read
మంగళగిరి ఎకోపార్కు వాకర్స్ కు శుభవార్త!
మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ గారు ఎకోపార్కు వాకర్స్ కు మరోసారి శుభవార్త అందించారు. మంగళగిరి ఎకోపార్కులో ఉదయం 6 నుంచి 9గంటల వరకు వాకింగ్ కు విచ్చేసేవారికి ఉచిత ప్రవేశం కల్
మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ గారు ఎకోపార్కు వాకర్స్ కు మరోసారి శుభవార్త అందించారు. మంగళగిరి ఎకోపార్కులో ఉదయం 6 నుంచి 9గంటల వరకు వాకింగ్ కు విచ్చేసేవారికి ఉచిత ప్రవేశం కల్పించేందుకుగాను 2026 సంవత్సరానికి లోకేష్ తన సొంత నిధులు చెల్లించారు. మంగళగిరి ఎకోపార్కు నిర్వహణ నిమిత్తం అటవీశాఖవారు ఎకోపార్కు సందర్శకులకు ప్రవేశ రుసుం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వాకర్స్ ప్రతినిధులు వాకింగ్ నిమిత్తం ఏకోపార్కులో ఉదయం 6 గంటలనుంచి 9 గంటల వరకు ఉచిత ప్రవేశం కల్పించాలని గతంలో మంత్రి నారా లోకేష్ ను కోరారు. నిబంధనల ప్రకారం ఉచిత ప్రవేశం కల్పించడం వీలుకాకపోవడంతో లోకేష్ తన సొంత నిధులు సుమారు 5 లక్షలకు పైగా డిపార్ట్ మెంట్ కు చెల్లించారు.