News16th Apr 05:16 PMSunil Byrisetty1 min read
ఇక టోల్ గేట్లు ఉండవు.. చార్జీలు మామూలే!
జాతీయ రహదారులపై ఉండే టోల్ గేట్స్ త్వరలో మాయం కానున్నాయి. కానీ టోల్ చార్జీలు మాత్రం కొనసాగుతాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా పేర్కొన్నారు. వాహనాల నెంబర్ శాటిలైట్ ట్రా
జాతీయ రహదారులపై ఉండే టోల్ గేట్స్ త్వరలో మాయం కానున్నాయి.
కానీ టోల్ చార్జీలు మాత్రం కొనసాగుతాయి.
ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా పేర్కొన్నారు.
వాహనాల నెంబర్ శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వెహికిల్ ఓనర్ అకౌంట్లోనుంచి టోల్ ఛార్జ్ కట్ అయ్యేలా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఆ నూతన పాలసీ అమలుపై 15రోజుల్లో ప్రకటన వస్తుందని మంత్రి పేర్కొన్నారు.
టోల్ గేట్ల వద్ద వాహనదారుల రద్దీ దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
అంటే టోల్ గేట్ ఉన్నా లేకున్నా వాహనదారుల జేబులకు చిల్లు మాత్రం కామనేనని తెలుస్తోంది.