News13th Oct 03:59 PMSunil Byrisetty1 min read
చారిత్మాత్మక గూగుల్ ఎఐ హబ్ కు ఢిల్లీలో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఇది ఎపి చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. భారత ఎఐ శక్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఇది ఎపి చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. భారత ఎఐ శక్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (ఎఐ) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయుపై న్యూ ఢిల్లీలో సంతకాలు చేయనున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ)గా రికార్డు సృష్టించబోతోంది. న్యూఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్ లో మంగళవారం ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎపి ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఎంఓయుపై సంతకాలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఎఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఒప్పందం ప్రధాన లక్ష్యం.