Technology29th Aug 10:19 AMSunil Byrisetty1 min read

30 నెలల్లో గూగుల్ పూర్తి!

విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ మొదటి దశ నిర్మాణాన్ని రాబోయే 24 నుంచి 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2028 నాటికి నిర్మాణ పనులన

30 నెలల్లో గూగుల్ పూర్తి!
విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ మొదటి దశ నిర్మాణాన్ని రాబోయే 24 నుంచి 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2028 నాటికి నిర్మాణ పనులను ముగించి, 1 గిగావాట్ సామర్థ్యం గల ఈ డేటా సెంటర్‌లో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఐదేళ్ల వ్యవధిలో ఈ హబ్ ద్వారా పూర్తిస్థాయి కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు గూగుల్ ఆసియా పసిఫిక్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ ప్రిన్సిపల్ అలెగ్జాండర్ స్మిత్ ప్రకటించారు. ఏఐ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కేబుల్ కనెక్టివిటీ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, విద్యుత్ సరఫరా, డేటా సెంటర్ సదుపాయాలన్నింటినీ సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ ఏఐ హబ్ ద్వారా భారత్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న గూగుల్ ఏఐ అప్లికేషన్ల వేగాన్ని మరింత పెంచడంతో పాటు లేటెన్సీని గణనీయంగా తగ్గించవచ్చని సంస్థ ఆశిస్తోంది.
Google
Google AI Hub
Visakhapatnam
Artificial Intelligence
AI Data Center
Data Center
1 GW Data Center
Google India
AI Infrastructure
Technology
Renewable Energy
టెక్నాలజీ
పునరుత్పాదక ఇంధనం
కేబుల్ కనెక్టివిటీ
ఆంధ్రప్రదేశ్
విశాఖ అభివృద్ధి
డిజిటల్ మౌలిక సదుపాయాలు
Scroll for the next article