News15th Oct 12:37 PMSunil Byrisetty1 min read

దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ పర్యటనపై ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘గూగుల్‌ ఏఐ డేటా హబ్‌ ఏర్పాటుకు నిన్

దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి
ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ పర్యటనపై ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘గూగుల్‌ ఏఐ డేటా హబ్‌ ఏర్పాటుకు నిన్న ఒప్పందం చేసుకున్నాం. ఈ హబ్‌ రావడంలో ప్రధాని, కేంద్ర మంత్రుల చొరవ ఉంది. గూగుల్‌ రావడానికి మంత్రి నారా లోకేశ్‌ ప్రధాన పాత్ర పోషించారు. 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు గూగుల్‌ ముందుకొచ్చింది. దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. గత పాలకులు చేసిన విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.’’ అని చంద్రబాబు తెలిపారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Narendra Modi
Google
AI Data Hub
Foreign Direct Investment
FDI
Nara Lokesh
సాంకేతిక పెట్టుబడులు
భారత ఆర్థిక వ్యవస్థ
బిగ్ టెక్
Scroll for the next article