News10th Dec 02:13 PMSunil Byrisetty1 min read

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో మంత్రి లోకేష్ భేటీ

గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే (గ్లోబ

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో  మంత్రి లోకేష్ భేటీ
గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే (గ్లోబల్ నెట్ వర్కింగ్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో $15బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడం, అమలు కాలంపై చర్చించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పోరేషన్ ద్వారా డేటా సెంటర్–సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. భారత్ లో క్లౌడ్ రీజియన్‌ల విస్తరణతోపాటు “గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్” ద్వారా స్టార్టప్‌లకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ ప్రకటించిన $15 బిలియన్ విలువైన AI డేటా సెంటర్ అమెరికా వెలుపల అతిపెద్ద ఎఫ్ డీఐగా పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు “వింగ్స్” తయారవుతున్నాయని తెలిపారు. గూగుల్ ఉత్పత్తులను ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
Andhra Pradesh
AI Data Center
Sundar Pichai
Nara Lokesh
Google
Drone City
Investment
Cloud Computing
Startups
Google Cloud
Tech Projects
FDI
Scroll for the next article