News23rd Oct 03:55 PMSunil Byrisetty1 min read
గూగుల్ కంటే ముందే.. విశాఖను గుర్తించిన అగ్రదేశాలు
గూగుల్ సంస్థ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనతో విశాఖపట్నం పేరు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, టెక్నాలజీ ప్రపంచం గుర్తించడానికి చాలా కాల
గూగుల్ సంస్థ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనతో విశాఖపట్నం పేరు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, టెక్నాలజీ ప్రపంచం గుర్తించడానికి చాలా కాలం ముందు నుంచే అగ్ర దేశాలు విశాఖను ఓ కీలకమైన వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పరిగణిస్తున్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు తమ శాటిలైట్లతో నిరంతరం ఈ నగరంపై ఓ కన్నేసి ఉంచుతున్నాయంటే ఇక్కడి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఏర్పాటు చేస్తున్న సంస్థలతో విశాఖ ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థకు తూర్పు తీరంలో ఓ కంచుకోటగా మారింది. భారత నావికాదళానికి విశాఖ గుండెకాయ వంటిది. ఇక్కడి షిప్ బిల్డింగ్ సెంటర్ (ఎస్‌బీసీ) ఇప్పుడు పూర్తిగా అణు జలాంతర్గాముల నిర్మాణ కేంద్రంగా మారిపోయింది. రష్యా సహకారంతో ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాత్, అర్థిమాన్‌లను ఇక్కడే నిర్మించారు. ప్రస్తుతం నాలుగో అణు జలాంతర్గామి నిర్మాణంలో ఉంది. కొవ్వాడలో భారీ అణు విద్యుత్ ప్లాంటు కూడా నిర్మాణంలో ఉండటంతో, విశాఖ కేవలం పారిశ్రామిక నగరంగానే కాకుండా, భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన కేంద్రంగా రూపాంతరం చెందింది.