News31st Jul 02:31 PMSunil Byrisetty1 min read

అమెరికా తర్వాత విశాఖనే!

గూగుల్ విశాఖలో పెట్టుబడులు పెట్టబోతోందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఎంవోయూ కూడా చేసుకున్నారు. అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించుకున

అమెరికా తర్వాత విశాఖనే!
గూగుల్ విశాఖలో పెట్టుబడులు పెట్టబోతోందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఎంవోయూ కూడా చేసుకున్నారు. అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ ను విశాఖలోనే ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రకటించింది. గూగుల్ విశాఖపట్నంలో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను నిర్మించడానికి 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అంటే మన రూపాయల్లో 50 వేల కోట్లు. ఈ పెట్టుబడిలో 2 బిలియన్లు రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ కోసం కేటాయిస్తారు. ఇది డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ అందిస్తుంది. ఈ డేటా సెంటర్ ఆసియాలో అతిపెద్దదిగా ఉంటుందని, సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లలో గూగుల్ డేటా సెంటర్ విస్తరణలో భాగంగా ఉంటుందని రాయిటర్స్ చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌ను ఒక టెక్ హబ్‌గా మార్చడంలో భాగంగా, విశాఖపట్నంలో మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నారా లోకేష్ ప్రకటించారు.
Andhra Pradesh news
Google Visakhapatnam Investment
Asia’s Largest Data Center
Renewable Energy Infrastructure
$6 Billion Google Project
Tech Hub
గూగుల్ పెట్టుబడి
విశాఖపట్నం డేటా సెంటర్
ఆంధ్రప్రదేశ్ టెక్ హబ్
Scroll for the next article