News2nd Nov 02:57 PMSunil Byrisetty1 min read

రియల్ మోసాలకు గూగుల్ నే వాడేస్తున్నారు

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ కారిడార్లలో ఖాళీ స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేసే వినియోగదారులను బురిడీ కొట్టించేందుకు కేటుగాళ్లు సరికొత్త డిజిటల్ ట్రిక్‌ను తెరపైకి తెచ్చారు. సాంకేతి

రియల్ మోసాలకు గూగుల్ నే వాడేస్తున్నారు
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ కారిడార్లలో ఖాళీ స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేసే వినియోగదారులను బురిడీ కొట్టించేందుకు కేటుగాళ్లు సరికొత్త డిజిటల్ ట్రిక్‌ను తెరపైకి తెచ్చారు. సాంకేతికతను ఆసరాగా చేసుకుని, ప్రముఖ నేవిగేషన్ ప్లాట్‌ఫామ్‌లైన గూగుల్ మ్యాప్స్ , ఓపెన్ స్ట్రీట్ మ్యాప్స్‌లో నకిలీ ల్యాండ్‌మార్క్‌లను సృష్టిస్తున్నారు. తమ వెంచర్ సమీపంలో భూముల ధరలను కృత్రిమంగా పెంచడానికి, కొనుగోలుదారులను మానసికంగా బురిడీ కొట్టించడానికి ఈ రకమైన డిజిటల్ క్రియేటివిటీ ని ప్రయోగిస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా దండుకుంటున్నారు. గూగుల్ మ్యాప్స్‌లో ఎవరైనా ఒక బిజినెస్ లేదా లొకేషన్‌ను యాడ్ చేసే వెసులుబాటును ఈ డెవలపర్లు దుర్వినియోగం చేస్తున్నారు. తమ వెంచర్‌కు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ప్రతిపాదిత ఐటీ పార్క్ , ప్రతిపాదిత మెట్రో స్టేషన్ లేదా ప్రభుత్వ మెగా ప్రాజెక్ట్ పేరుతో ఫేక్ లొకేషన్ పిన్‌లను క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత సదరు లొకేషన్‌కు పాజిటివ్ రివ్యూలు, రేటింగ్‌లు వేయించి, అది నిజమైన ప్రభుత్వ ప్రణాళికేనని నమ్మించేలా మ్యాప్‌లో ఒక ల్యాండ్‌మార్క్‌ను సిద్ధం చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ అనేది కేవలం నేవిగేషన్ సాధనం మాత్రమేనని, అందులో ఎవరైనా పిన్స్ సృష్టించవచ్చనే విషయాన్ని గ్రహించాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు.
Scroll for the next article