Mobiles30th Aug 12:31 PMSunil Byrisetty1 min read
గూగుల్ పిక్సెల్ 10లో కొత్త ఫీచర్
గూగుల్ కొత్త పిక్సెల్ 10 సిరీస్ (పిక్సెల్ 10, పిక్సెల్ 10 Pro, పిక్సెల్ 10 Pro XL, పిక్సెల్ 10 Pro Fold) ఫోన్లలో కొత్త ఫీచర్ చేరింది. ఇక ఆ ఫోన్ల నుంచి మొబైల్ సిగ్నల్ లేదా వైఫై లేకప
గూగుల్ కొత్త పిక్సెల్ 10 సిరీస్ (పిక్సెల్ 10, పిక్సెల్ 10 Pro, పిక్సెల్ 10 Pro XL, పిక్సెల్ 10 Pro Fold) ఫోన్లలో కొత్త ఫీచర్ చేరింది. ఇక ఆ ఫోన్ల నుంచి మొబైల్ సిగ్నల్ లేదా వైఫై లేకపోయినా వాట్సాప్ వాయిస్ మరియు వీడియో కాల్స్ చేయొచ్చని చెబుతున్నారు. నెట్‌వర్క్ లేకపోతే ఫోన్ ఆటోమేటిక్‌గా శాటిలైట్‌కి కనెక్ట్ అవుతుంది. కాల్ సమయంలో స్టేటస్ బార్‌లో శాటిలైట్ గుర్తు కనిపిస్తుంది. iPhoneలో శాటిలైట్ ఫీచర్ అత్యవసర మెసేజ్‌లకే పరిమితం. కానీ Pixel 10లో నేరుగా వాట్సాప్ కాల్స్ చేయవచ్చు. ట్రావెల్ చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉండనుంది. గ్రామీణ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అరణ్యాలు లాంటి చోట్ల కూడా కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఈ ఫీచర్ కోసం క్యారియర్ సపోర్ట్ అవసరమవుతుంది. అనగా శాటిలైట్ సర్వీస్ ఇచ్చే నెట్‌వర్క్ ఆపరేటర్లు ఉన్నప్పుడే పనిచేస్తుంది. భారతదేశంలో ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం అమెరికా, యూరప్ లో ఈ సర్వీస్ ప్రారంభమైంది.