News14th Oct 01:20 PMSunil Byrisetty1 min read
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగు
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఢిల్లీలో సమావేశం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వివీ వైష్ణవ్, మంత్రి లోకేష్ హాజరయ్యారు. గూగుల్ సంస
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఢిల్లీలో సమావేశం జరిగింది. సమావేశానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వివీ వైష్ణవ్, మంత్రి లోకేష్ హాజరయ్యారు. గూగుల్ సంస్థ నుంచి సమావేశానికి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సహా వివిధ ప్రతినిధులు హజరయ్యారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్ధతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.87520 కోట్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఒక గిగా వాట్ కెపాసిటీతో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో ఏఐ డేటా సెంటర్ సేవలు అందించనుంది. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ-కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుంది.