News14th Oct 10:14 AMSunil Byrisetty1 min read

గూగుల్‌తో ఒప్పందం.. ఢిల్లీలో నేడు కీలక ఘట్టం

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖపట్నం కేంద్రంగా రూ.88,628 కోట్ల (10 బిలియన్ డాలర్ల) భారీ వ్యయంతో హైపర్‌ స్కేల్ డేటా సెంటర్‌తో

గూగుల్‌తో ఒప్పందం.. ఢిల్లీలో నేడు కీలక ఘట్టం
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖపట్నం కేంద్రంగా రూ.88,628 కోట్ల (10 బిలియన్ డాలర్ల) భారీ వ్యయంతో హైపర్‌ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు, దేశంలోనే తొలి 'గూగుల్ ఏఐ హబ్' ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై మంగళవారం ఢిల్లీలో సంతకాలు జరగనున్నాయి. ఢిల్లీలోని తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో ఉదయం 10 గంటలకు ఈ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు, గూగుల్ అనుబంధ సంస్థ 'రైడెన్' ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) ఇదే అతిపెద్దదిగా నిలవనుండటం విశేషం.
Andhra Pradesh
Vishakhapatnam
Google
AI Hub
Investment
Tech News
Data Center
Chandrababu Naidu
Nirmala Sitharaman
అశ్వినీ వైష్ణవ్
నారా లోకేష్
డిజిటల్ ఇండియా
విదేశీ పెట్టుబడి
ఆవిష్కరణ
గూగుల్ ఇండియా
Scroll for the next article