Technology13th Jun 12:14 PMSunil Byrisetty1 min read
ఈ యాప్స్ ఉన్నాయా? డేంజర్!
ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్లకు యాప్ అలర్ట్ వచ్చింది. కొన్ని మోసపూరిత యాప్‌లు మీరు నమ్మే అసలు యాప్‌ల లోగోలు, పేర్లను కాపీ చేసి మోసం చేస్తున్నాయని తేలింది. ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తే
ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వాళ్లకు యాప్ అలర్ట్ వచ్చింది. కొన్ని మోసపూరిత యాప్‌లు మీరు నమ్మే అసలు యాప్‌ల లోగోలు, పేర్లను కాపీ చేసి మోసం చేస్తున్నాయని తేలింది. ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తే, అవి నకిలీ వెబ్‌సైట్‌లకు (Delete These Apps) వెళ్లేలా చేస్తాయి. సైబుల్ రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (CRIL) నివేదిక ప్రకారం, 20కి పైగా ప్రమాదకరమైన క్రిప్టో వాలెట్ యాప్‌లు ప్లే స్టోర్‌లో ఉన్నాయి. ఈ యాప్‌లు మీ వాలెట్ రికవరీ సమాచారాన్ని దొంగిలించి మీ అకౌంట్‌ను పూర్తిగా నాశనం చేస్తాయి. గుర్తించబడిన మోసపూరిత యాప్‌లు Pancake Swap, Suiet Wallet, Hyperliquid, Raydium, BullX Crypto, OpenOcean Exchange, Meteora Exchange, SushiSwap, Harvest Finance Blog
మీ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉంటే వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ ప్లే స్టోర్ సూచించింది. యాప్‌లకు ఉన్న అనుమతులను ఆఫ్ చేసి అన్‌ఇన్‌స్టాల్ చేయండి, ఆపై అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఎప్పుడూ తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదు. యాప్ డౌన్‌లోడ్ చేసే ముందు రివ్యూలు, రేటింగ్‌లు చదవాలి.