Technology25th Jul 12:11 PMSunil Byrisetty1 min read

గూగుల్ స్పేస్.. అన్నీ లెక్కలోకే!

మన స్మార్ట్ ఫోన్లో గూగుల్ ఇచ్చే 15 జీబీ స్పేస్ సరిపోవడం లేదా? అందుకోసం వీడియోలు, ఫొటోలు డిలిట్ చేస్తూ తంటాలు పడుతున్నారా? అయితే ఇకముందు మరిన్ని తంటాలు పడక తప్పదు. మొన్నటి వరకు మెయి

గూగుల్ స్పేస్.. అన్నీ లెక్కలోకే!
మన స్మార్ట్ ఫోన్లో గూగుల్ ఇచ్చే 15 జీబీ స్పేస్ సరిపోవడం లేదా? అందుకోసం వీడియోలు, ఫొటోలు డిలిట్ చేస్తూ తంటాలు పడుతున్నారా? అయితే ఇకముందు మరిన్ని తంటాలు పడక తప్పదు. మొన్నటి వరకు మెయిల్స్, గూగుల్ ఫొటోస్, డ్రైవ్ లోని స్టోరేజీనే లెక్కలో ఉండేది. ఇప్పుడు ఫోన్లోని మెసేజులు, కాల్ డేటా, ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగులు, యాప్ సెట్టింగులు ఇలా అన్నీ లెక్కలోకే వచ్చాయి. మీ గూగుల్ ఖాతాలోని 15 జీబీ ఖాళీ అవుతున్నట్లే.. ఎందుకంటే గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ బ్యాకప్ స్టోరేజి పాలసీ, నియంత్రణలు రూపొందించింది. జులై 7 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. గూగుల్ డ్రైవ్ లోని డేటా.. అంటే పీడీఎఫ్, ఫొటోలు, వీడియోలు, కొత్త గూగుల్ డాక్స్ కూడా ఇందులోనే కలిపేస్తారు. ఎస్ఎంఎస్, కాల్ హిస్టరీ, కాల్ సెట్టింగ్స్ తక్కువ సైజులోనే ఉంటాయి. అయినప్పటికీ ఆ కొంచెం స్పేస్ కూడా 15 జీబీ పరిమితిలో కొంత వాటా అవుతుంది.
Tech News
Google
Google Drive
Google Photos
Gmail
Android Backup
Google Storage
15GB Storage
Cloud Storage
Android
Google Account
Data Backup
Scroll for the next article