Telangana29th Jul 05:34 PMSunil Byrisetty1 min read
బీజేపీ నా ఇల్లు.. పిలిస్తే చేరిపోతా!
బీజేపీ తన సొంత ఇల్లు అని, వేరే పార్టీలోకి చేరడం అనేది జరగదని తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తనకు వేరే పార్టీలు సెట్ అవ్వవనని తేల్చి చెప్పారు. బీజేపీకి మాత్రమే రాజీనామా
బీజేపీ తన సొంత ఇల్లు అని, వేరే పార్టీలోకి చేరడం అనేది జరగదని తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తనకు వేరే పార్టీలు సెట్ అవ్వవనని తేల్చి చెప్పారు. బీజేపీకి మాత్రమే రాజీనామా చేశానని.. ఎమ్మెల్యే పదవికి చేయలేదని చెప్పారు. ఇంకో మూడేళ్లు తానే ఎమ్మెల్యేనని, పదవికి రాజీనామా చేయని వివరించారు. కొన్ని తప్పులు జరిగితే, సోషల్ మీడియా ఇంకొన్ని ప్రచారం చేశారన్నారు. బీజేపీ పెద్దలు పిలిస్తే ఢిల్లీకి వెళ్లి జరిగింది అంతా చెప్తానన్నారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినప్పుడు రాని ఉపఎన్నికలు గోషామహల్‌లో ఎలా వస్తాయని రాజాసింగ్ ప్రశ్నించారు. పెద్దలు పిలిస్తే బీజేపీలో చేరిపోతానని స్పష్టం చేశారు.