News7th Oct 10:19 AMSunil Byrisetty1 min read

నాటకానికి ప్రభుత్వం, ప్రజల సహకారం అవసరం

తెలుగు నాటక రంగానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని గుంటూరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరుడు

నాటకానికి ప్రభుత్వం, ప్రజల సహకారం అవసరం
తెలుగు నాటక రంగానికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని గుంటూరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరుడు పెమ్మసాని రవిశంకర్ (రవి) అన్నారు. గుంటూరులో అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న ‘నారా చంద్రబాబు నాటకోత్సవం–2026’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నాటకం కేవలం వినోద సాధనం మాత్రమే కాదని, సమాజాన్ని ఆలోచింపజేసే, ప్రజల్లో చైతన్యం కలిగించే శక్తివంతమైన కళారూపమని అన్నారు. సినిమా, టెలివిజన్, డిజిటల్ మీడియా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా నాటక రంగం తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడం అభినందనీయమన్నారు. నాటక కళాకారులు, పరిషత్‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కళను కొనసాగిస్తున్నారని, వారికి ప్రభుత్వం, ప్రజలు, కళాభిమానులు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. నేటి యువతకు నాటక రంగాన్ని మరింత చేరువ చేయడంతో పాటు, కొత్త రచయితలు, దర్శకులు, నటీనటులను ప్రోత్సహించేలా నాటకోత్సవాలు నిర్వహించడం అవసరమని ఆయన పేర్కొన్నారు.
Scroll for the next article