News19th Jan 11:50 AMSunil Byrisetty1 min read
సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ నియామకం
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కమిషనర్లుగా మరో నలుగురిని ప్రభుత్వం నియమించింది. ఏపీ సమాచార కమిషన్ కు చీఫ్ కమిషనర్ సహా నలుగు
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కమిషనర్లుగా మరో నలుగురిని ప్రభుత్వం నియమించింది. ఏపీ సమాచార కమిషన్ కు చీఫ్ కమిషనర్ సహా నలుగురు కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. చీఫ్ కమిషనర్ అడ్వకేట్ వజ్జా శ్రీనివాసరావు నియమితులయ్యారు. కమిషనర్లుగా వి.శరత్చంద్ర కల్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, ఒంటేరు రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడులను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల సర్వీస్ లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఆర్టీఐ కమిషనర్లుగా వీరు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.