News6th Jan 01:54 PMSunil Byrisetty1 min read
రూ.4500 కోట్ల ట్రూఅప్ భారాన్ని భరించి, చార్జీలు తగ్గించాం
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. వివిధ రంగాల ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఇదని తెలిపారు. గత 1
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. వివిధ రంగాల ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఇదని తెలిపారు. గత 13 సమావేశాల్లో రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలకు ఆమోదం లభించింది. 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు, అధికారుల టీమ్‌వర్క్‌కు కితాబు పలుకుతూ రాష్ట్ర బ్రాండ్ తిరిగి వచ్చిందన్నారు. టాటా, అదానీ, రిలయెన్స్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించి, రూ.4500 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని వివరించారు. స్పీడ్ ఆఫ్ డెలివరీతో గవర్నెన్స్ ఫలితాలు సాధించాలని సీఎం పిలుపునిచ్చారు.