News13th Aug 03:04 PMSunil Byrisetty1 min read
ఆ మలుపు మంచిదే
రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులపై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం అధికారిక వివరణ విడుదల చేసింది. సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్–3లో భాగ
రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులపై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం అధికారిక వివరణ విడుదల చేసింది. సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్–3లో భాగంగా విజయవాడ–చెన్నై జాతీయ రహదారి (NH–16)ను మణిపాల్ హాస్పిటల్ సమీపంలో అనుసంధానించే ప్రధాన రహదారి కారిడార్ నిర్మించాల్సి ఉంది. భవిష్యత్‌లో చేపట్టనున్న ఈ కారిడార్ నిర్మాణానికి అనుగుణంగా, అవసరమైన భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానాలు, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం చేపట్టబడింది. రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు, కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యంగా సీడ్ యాక్సెస్ రహదారిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందువల్ల సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులను భవిష్యత్ రహదారి కారిడార్ నిర్మాణం, అనుసంధాన అవసరాలు, సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలో భాగంగా చూడాలని పేర్కొంది.