News3rd Dec 04:58 PMSunil Byrisetty1 min read

గూగుల్ కు భూముల అప్పగింత

గూగుల్ డేటాసెంటర్ కు భూముల బదలాయింపుపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్టుకు అవసరమైన భూములను ప్రభుత్వం బదిలీకి అనుమతి ఇచ్చింది. గూగుల్కు చెందిన అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక

గూగుల్ కు భూముల అప్పగింత
గూగుల్ డేటాసెంటర్ కు భూముల బదలాయింపుపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్టుకు అవసరమైన భూములను ప్రభుత్వం బదిలీకి అనుమతి ఇచ్చింది. గూగుల్కు చెందిన అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో పాటు, అధికారికంగా నోటిపై చేసిన భాగస్వామ్య సంస్థలు కలిసి నిర్మించనున్న 1,000మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించేందుకు కూడా అంగీకారం తెలిపింది. డేటాసెంటర్ క్యాంపస్ ను అభివృద్ధి చేసుకునేందుకు రైడెన్, దాని నోటిఫైడ్ భాగస్వామ్య సంస్థలకు భూములు బదిలీ చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
India Tech
Google
Data Center
Land Transfer
Government Approval
AI Infrastructure
Raiden Infotech
Tech Investment
AP Government
IT Development
Scroll for the next article