News9th Oct 04:17 PMSunil Byrisetty1 min read

నాటక కళాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

నాటక కళాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. నాటక రంగానికి

నాటక కళాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
నాటక కళాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. నాటక రంగానికి విశేష సేవలందిస్తూ, కళాకారులకు వేదికలు కల్పిస్తూ అనేక నాటకోత్సవాలను నిర్వహిస్తున్న అభినయ శ్రీనివాస్ కృషిని ఆయన అభినందించారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఈ రోజు అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న మూడవ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటికోత్సవం ‘నారా చంద్రబాబు నాటకోత్సవం–2026’ పోస్టర్‌ను మన్నవ మోహన్ కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటక రంగానికి సుదీర్ఘ చరిత్ర, గొప్ప సంప్రదాయం ఉందని, సమాజంలో చైతన్యం తీసుకురావడంలో నాటకానికి ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. నాటక కళను బతికించుకోవాలంటే కళాకారులకు నిరంతరం ప్రదర్శన అవకాశాలు, కొత్త తరానికి ప్రోత్సాహం, నాటక సమాజాలకు వేదికలు అవసరమని పేర్కొన్నారు. నాటక రంగాన్ని కేవలం ఒక కళారూపంగా కాకుండా తెలుగు సంస్కృతి, సామాజిక చైతన్యానికి ముఖ్యమైన సాధనంగా ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో కళలు, సాహిత్యం, సంస్కృతి, నాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు.
Scroll for the next article