News4th Sep 04:44 PMSunil Byrisetty1 min read
పారదర్శకంగా యూరియా పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరా, పంపిణీని ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతు
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా సరఫరా, పంపిణీని ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి అవసరమైనంత యూరియా సమయానికి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ వ్యవస్థను పర్యవేక్షిస్తూ, ఎక్కడా కొరత తలెత్తకుండా తగినన్ని నిల్వలు సిద్ధం చేశామని, ఏవైనా అవకతవకలు లేకుండా రైతులకు నేరుగా యూరియా చేరేలా కఠిన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనమే ప్రభుత్వ లక్ష్యమని, యూరియా సరఫరాలో అవినీతి, అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శక విధానాన్ని అమలు చేస్తూ, ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యూరియా సమృద్ధిగా లభ్యమవుతుందని, తప్పుడు కథనాలు, మాటలు నమ్మొద్దని సూచించారు.