Agriculture18th Aug 01:24 PMSunil Byrisetty1 min read
కొబ్బరి రైతులకు అండగా ప్రభుత్వం
కోనసీమలో కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శా
కోనసీమలో కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దెబ్బతిన్న ప్రతి కొబ్బరి చెట్టు స్థానంలో కొత్త మొక్క నాటించడంతో పాటు కాలువలు, డ్రెయిన్ల పూడికతీత ద్వారా సమస్య మూలాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతుండగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 0.36 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగవుతోందని మంత్రి తెలిపారు. కోనసీమ జిల్లాలో సుమారు 10 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు కౌలు రైతుల ద్వారా సాగవుతున్నాయని వివరించారు. గత ఐదేళ్లుగా కాలువల్లో సక్రమంగా పూడికతీత చేపట్టకపోవడంతో సముద్రపు ఉప్పునీరు బ్యాక్ వాటర్ రూపంలో వెనక్కి వచ్చి నేలలో లవణీయత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. కొబ్బరి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అంతర పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. పామాయిల్ తోటల్లో మాదిరిగానే కొబ్బరి తోటల్లో కోకో, అరటి, కూరగాయలు వంటి అంతర పంటలు సాగు చేస్తే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు.