News27th Jul 04:22 PMSunil Byrisetty1 min read
సీమ స్టీల్ కు ప్రభుత్వం సపోర్ట్!
రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ మంజురైంది. వైఎస్ఆర్ కడప జిల్లా, జమ్మలమడుగు మండలం, సున్నపురాళ్ళ పల్లెలో JSW AP Steel Limited సంస్థ నిర్మిస్తోంది.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ మంజురైంది. వైఎస్ఆర్ కడప జిల్లా, జమ్మలమడుగు మండలం, సున్నపురాళ్ళ పల్లెలో JSW AP Steel Limited సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్టు రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం అమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం ఏడాదికి 2 మిలియన్ టన్నులుగా ఉంది. (2 దశల్లో – ఒక్క దశకి 1 MTPA).
మొత్తం పెట్టుబడి వ్యయం రూ. 16,350 కోట్లుగా ఉంది.
ఫేజ్-1: ₹4,500 కోట్లు
ఫేజ్-2: ₹11,850 కోట్లు
ఈ ప్రాజెక్టుతో ఉద్యోగావకాశాలు మొత్తం 2,500 (ఫేజ్-1: 1,000..ఫేజ్-2: 1,500) రానున్నాయి.