News20th Mar 01:45 PMSunil Byrisetty1 min read

వారు గాలికి వదిలేశారు .. మనం గాడిలో పెడదాం

శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా గ్రామం వద్ద వంశధార నదిపై నిర్మించిన గొట్ట బ్యారేజ్ అనుబంధ కాలువల ఆధునికీకరణ పనులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాన

వారు గాలికి వదిలేశారు .. మనం గాడిలో పెడదాం
శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా గ్రామం వద్ద వంశధార నదిపై నిర్మించిన గొట్ట బ్యారేజ్ అనుబంధ కాలువల ఆధునికీకరణ పనులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. 1,48,235 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రాధాన్యత ప్రభుత్వానికి తెలుసునన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2018లో గొట్టా బ్యారేజ్ కాలువల ఆధునీకరణకు 676 కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేయించారని చెప్పారు. ప్రతిపాదన కార్యరూపం దాల్చే స్థాయిలో కొత్తగా వచ్చిన అరాచక వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మంత్రి విమర్శించారు. వంశధార స్టేజ్-2లో 2481 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న ఎడమ కాలువ ద్వారా ప్రస్తుతం 1800-1900 క్యూసెక్కుల మాత్రమే ప్రవహిస్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరించారు. ఎడమ కాలువపై 24 లిఫ్టులు ఉండడం వల్ల వాటికి మరో 360 క్యూసెక్కుల నీరు వెళుతోందన్నారు. అందువల్లనే ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీరందడం లేదన్నారు. ఆయకట్టు రైతుల అగచాట్లను, సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే వంశధార స్టేజ్-2 ఎడమ కాలువ పూడిక తీయడం, గట్లు పటిష్ట పరచడం, షట్టర్లు తదితర ఇతర నిర్మాణాలు ఆధునికరించటం వంటి పనులన్నిటికి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. గొట్టా బ్యారేజ్ ఆధునీకరణకు కూడా రూ. 16 కోట్లు వ్యయం ప్రతిపాదన ప్రభుత్వానికి సమర్పించి పరిపాలనామోదం కోసం చూస్తున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు.
Gotta Barrage
Minister Ramanaidu
శ్రీకాకుళం
చంద్రబాబు
Scroll for the next article