News29th Mar 12:12 PMSunil Byrisetty1 min read
పంచాయతీలకు ఇక పండుగే
పంచాయతీ రహదారులకు మహర్దశ పట్టనుంది. ఏపీలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 1202 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు గాను నాబార్
పంచాయతీ రహదారులకు మహర్దశ పట్టనుంది.
ఏపీలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 1202 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇందుకు గాను నాబార్డు నిధులు రూ.557 కోట్లను వినియోగించనున్నట్లు పేర్కొంది.
ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 402 రహదారులు వేయనున్నారు.
ఈ రోడ్లను నాణ్యతతో, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తనదైన మార్కులో దూసుకెళ్తున్నారు.
దారుణంగా తయారైన గ్రామీణ రహదారులను తీర్చిదిద్దేందుకు సంకల్పించారు.