News1st Nov 09:09 AMSunil Byrisetty1 min read
మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
దివంగత మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ప్రభుత్వోద్యోగం ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో సెప్టెంబర్ 28న పాడేరు, అరకు మండలాల్లో నక్సల్స్ కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వ
దివంగత మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ప్రభుత్వోద్యోగం ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో సెప్టెంబర్ 28న పాడేరు, అరకు మండలాల్లో నక్సల్స్ కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలను పరామర్శించినప్పుడు.. అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు.. సివేరి సోమా రెండవ కుమారుడు సివేరి సురేష్ కుమార్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం (Group-II) ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం ప్రభుత్వం సివేరి సురేష్ కుమార్‌ను డిప్యూటీ తహసీల్దార్, జోన్-I (రెవెన్యూ) గా నియమించారు. ఇది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీ స్థానంలో, Rule 3(b) కింద ప్రత్యేక సందర్భంగా అమలు చేయబడుతుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.