News12th Apr 03:42 PMSunil Byrisetty1 min read
సచివాలయాల విభజనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఏపీలో సచివాలయాలను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసి, గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరిలుగా విభజిస్తున్నట్లు పేర్కొంది. జనాభా ప
ఏపీలో సచివాలయాలను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
తాజాగా ఉత్తర్వులు జారీ చేసి, గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరిలుగా విభజిస్తున్నట్లు పేర్కొంది.
జనాభా ప్రాతిపదికన 2500లోపు జనాభా ఉన్న సచివాలయాలకు ఇద్దరు, 2501 నుంచి 3500 వరకు జనాభా ఉన్న సచివాలయాలకు ముగ్గురు సిబ్బందిని కేటాయించింది.
అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే నలుగురు సిబ్బందిని కేటాయిస్తున్నట్లు తెలిపింది.
ఏ-కేటగిరీ సచివాలయాల్లో మల్టీపర్పస్ సిబ్బంది ఇద్దరు, టెక్నికల్ సిబ్బంది నలుగురు కలిపి మొత్తం ఆరుగురిని నియమించనున్నారు.
బీ-కేటగిరీ సచివాలయాల్లో మల్టీపర్పస్ సిబ్బంది ముగ్గురు, టెక్నికల్ సిబ్బంది నలుగురితో కలిపి ఏడుగురు, సీ-కేటగిరీ సచివాలయాల్లో నలు గురు మల్టీపర్పస్ సిబ్బంది, నలుగురు టెక్నికల్ సిబ్బంది కలిపి మొత్తం 8 మందిని నియమిస్తారు.
ప్రత్యేక/ టెక్నికల్ సిబ్బందికి సంబంధించి గ్రామ సచివాలయాల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, అగ్రికల్చర్/హార్టీకల్చర్/సెరికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ/ఫిషరీస్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్‌ను, వార్డు సచివాలయాల్లో వార్డ్ రెవెన్యూ కార్యదర్శి, హెల్త్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి, అమెనిటీస్ కార్యదర్శి, శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శి, ఎనర్జీ కార్యదర్శులను నియమిస్తారు.
ఆయా కేటగిరీలకు సంబంధించి సచివాలయాల్లో సిబ్బంది నియామకాలపై జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.