News26th Jul 04:05 PMSunil Byrisetty1 min read

పంజా సెంటర్‌లో తృప్తి క్వాంటీన్లు ప్రారంభం

రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచి, స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సుర

పంజా సెంటర్‌లో తృప్తి క్వాంటీన్లు ప్రారంభం
రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచి, స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడ పంజా సెంటర్లో తృప్తి క్యాంటీన్‌ను మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎమ్‌లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలగా ప్రోత్సహించేందుకు 'తృప్తి' క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 750 క్యాంటీన్లను ప్రారంభించనున్నామన్నారు. ఇప్పటికే నెల్లూరులో తృప్తి క్వాంటీన్లను ఏర్పాటు చేస్తే అది దిగ్విజయంగా రోజుకు రూ. 10,000-15,000 వరకు ఆదాయం డ్వాక్రా మహిళలకు వస్తుందన్నారు.
Andhra Pradesh news
Thripti Canteen
DWCRA Women
Women Empowerment
Urban Development
Poverty Alleviation
MEPMA
Self-Reliance
తృప్తి క్యాంటీన్
డ్వాక్రా మహిళలు
మహిళా శక్తీకరణ
Scroll for the next article