News25th Jun 09:39 AMSunil Byrisetty1 min read
విజయవాడకు ఈవీ బస్సులు!
విజయవాడ మహా నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయి. నగరంలో ఈవీ బస్సులు సేవ అందించనున్నాయి. ప్రధాన మార్గాల్లో ఈ బస్సులు సర్వీసులు నడపనున్నాయి. రద్దీ రూట్లు అయిన కాళేశ్వరరావు మా
విజయవాడ మహా నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయి. నగరంలో ఈవీ బస్సులు సేవ అందించనున్నాయి. ప్రధాన మార్గాల్లో ఈ బస్సులు సర్వీసులు నడపనున్నాయి. రద్దీ రూట్లు అయిన కాళేశ్వరరావు మార్కెట్ - ఆటోనగర్, రైల్వేస్టేషన్ - ఆటోనగర్, హెచ్‌బీ కాలనీ - ఆటోనగర్, హెచ్‌బీ కాలనీ - పెనమలూరు, సిటీబస్ పోర్టు - మైలవరం, సిటీ బస్‌పోర్టు - విస్సన్నపేట, కాళేశ్వరరావు మార్కెట్ - పామర్రు, ఎన్‌ఎస్‌బీ నగర్ - ఆటోనగర్, పీఎన్‌బీఎస్ - విస్సన్నపేట, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ - ఆటోనగర్, కబేళా - గవర్నమెంట్ ప్రెస్, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ - తాడిగడప రూట్ల మీదుగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ పేర్లతో ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు. దీంతో కాలుష్యం తగ్గనుంది.