News3rd Dec 12:33 PMSunil Byrisetty1 min read
అన్ని ఫోన్లలో సంచార్ సాథీ యాప్.. ప్రతిపక్షం ప్రశ్నలు
స్మార్ట్ ఫోన్ల సెక్యూరిటీ కోసం కేంద్రం ప్రతి మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ ఇన్ స్టాల్ చేయాలని ఆదేశించింది. మార్చి 2026 నుంచి అమ్మే ప్రతి కొత్త మొబైల్ ఫోన్‌లలో సంచార్ సాథీ యాప్‌ను
స్మార్ట్ ఫోన్ల సెక్యూరిటీ కోసం కేంద్రం ప్రతి మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ ఇన్ స్టాల్ చేయాలని ఆదేశించింది. మార్చి 2026 నుంచి అమ్మే ప్రతి కొత్త మొబైల్ ఫోన్‌లలో సంచార్ సాథీ యాప్‌ను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటీ) సోమవారం స్మార్ట్‌ఫోన్ తయారీదారులను ఆదేశించింది. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ యాప్‌ను డీయాక్టివేట్ చేయకుండా లేదా దానిపై ఎటువంటి పరిమితులు విధించకుండా చూడాలని పేర్కొంది. మొబైల్ పరికరాల్లో ఉపయోగించే ఐఎమ్ఈఐ నంబర్ల ప్రామాణికతను ధృవీకరించడానికి సంచార్ సాథీ యాప్ ఉపయోగిస్తారని కేంద్రం తెలిపింది. అయితే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసిన పరికరాల ఐఎమ్ఈఐ నంబర్‌ను స్వయంగా తీసుకుంటుందా లేక యూజర్లు దానిని నమోదు చేసుకోవాలా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ చర్యను తీవ్రంగా విమర్శించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఈ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.