Education24th Oct 03:32 PMSunil Byrisetty1 min read

ఎంబీబీఎస్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల ముందంజ

రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రైవేటు కళాశాలల కంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు మెరుగైన ఉత్తీర్ణతను నమోదు చేస్తున్నాయి. డా. ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞా

ఎంబీబీఎస్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల ముందంజ
రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రైవేటు కళాశాలల కంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు మెరుగైన ఉత్తీర్ణతను నమోదు చేస్తున్నాయి. డా. ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 88.11 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రైవేటు కళాశాలల్లో 80.68 శాతమే ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత 7.43 శాతం మేర అధికంగా నమోదైంది. 2025–26 విద్యా సంవత్సరంలో సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడలో 93.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఆంధ్ర వైద్య కళాశాల, విశాఖపట్నంలో 93.20 శాతం, శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల, తిరుపతిలో 92.50 శాతం, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 92 శాతం ఉత్తీర్ణత నమోదయ్యాయి. కర్నూలులో 90.80 శాతం, మచిలీపట్నంలో 88.67 శాతం, రాజమహేంద్రవరంలో 88 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇతర కళాశాలల్లో ఏసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరులో 86.86 శాతం, నంద్యాలలో 86.51 శాతం, రంగరాయ వైద్య కళాశాల, కాకినాడలో 86 శాతం, శ్రీకాకుళంలో 86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అనంతపురంలో 84.92 శాతం, ఏలూరులో 84.67 శాతం, గుంటూరులో 84 శాతం, విజయనగరంలో 83.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే కొన్ని కళాశాలల్లో ఉత్తీర్ణత తగ్గగా, మరికొన్ని కళాశాలల్లో పెరిగింది. ముఖ్యంగా పాడేరు, మచిలీపట్నం, ఆంధ్ర వైద్య కళాశాలల్లో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.
Scroll for the next article