News13th Jun 10:57 AMSunil Byrisetty1 min read
రెవెన్యూ డివిజన్లలో ఆఫీసులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో రెవిన్యూ డివిజన్లలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు (DDO) ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే డివిజన్లో ఉన్న అ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో రెవిన్యూ డివిజన్లలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు (DDO) ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే డివిజన్లో ఉన్న అన్ని పంచాయతీ అభివృద్ధి శాఖలు, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయం, డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయాలు.. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ డిడిఓ కార్యాలయాలకు మార్చాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కార్యాలయాల ఏర్పాటుకు ఫర్నిచర్ ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. అందుబాటులో ఉన్న నిధులతో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లా పరిషత్ సీఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త కార్యాలయాలు కొలువుదీరనున్నాయి.