Education24th Jul 03:14 PMSunil Byrisetty1 min read
కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ విద్య
కార్పొరేట్ విద్యా సంస్థల కంటే మెరుగైన, నాణ్యమైన విద్యను ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందిస్తున్నామని, క్వాలిఫైడ్ టీచర్లతో బోధన సాగిస్తున్నామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. విశాలమైన గదులు
కార్పొరేట్ విద్యా సంస్థల కంటే మెరుగైన, నాణ్యమైన విద్యను ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందిస్తున్నామని, క్వాలిఫైడ్ టీచర్లతో బోధన సాగిస్తున్నామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. విశాలమైన గదులు, మైదానాలు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఉన్నాయన్నారు. త్వరలో మరో డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు తెలిపారు. మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్(పీటీఎం)తో విద్యార్థుల పురోగతి మరింత మెరుగుపడుతుందని అన్నారు. రికార్డు స్థాయిలో పేరెంట్స్ సమావేశాలు నిర్వహించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. నరసాపురం నియోజకవర్గం తూర్పుతాళ్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం(మెగా పీటీఎం) (Mega PTM 4.0) లో స్థానిక ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్ తో కలిసి ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య బలోపేతానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వ విద్యను గాడినపెడుతున్నారన్నారు.