News24th Oct 03:00 PMSunil Byrisetty1 min read

అధైర్య పడొద్దు.. అన్నదాతకు అండగా ఉంటాం

రాష్ట్రంలోని అన్నదాతలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలివానల కారణం

అధైర్య పడొద్దు.. అన్నదాతకు  అండగా ఉంటాం
రాష్ట్రంలోని అన్నదాతలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలివానల కారణంగా పంటలు, నీట మునిగి నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో పంట పొలాలను మంత్రి సుభాష్ కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్య పడవద్దు.. కూటమి ప్రభుత్వం మీకు అన్నివేళలా అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ఎంతమంది రైతులు ఇన్సూరెన్స్ చేయించుకున్నారో తెలుసుకొని ఒక నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో పంటల పరిశీలనలు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తూ, నష్టపోయిన రైతులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే 68 పీపీసీలు (PPCs) ద్వారా ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు ఈ అక్టోబర్ 27 నుండి నవంబర్ 10 వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మంత్రిమంత్రి సుభాష్ వెల్లడించారు.
Andhra Pradesh
Farmers Support
Minister Vasamsetti Subhash
Crop Loss
Heavy Rains
Farmer Relief
ప్రభుత్వం సహాయం
వ్యవసాయం
ధాన్యం కొనుగోలు
జనసేన
టిడిపి కూటమి
అన్నదాతకు అండ
Scroll for the next article