News10th Nov 04:09 PMSunil Byrisetty1 min read

ఆలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ప్రభుత్వం దృష్టి

ఆలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొక్కిసలా

ఆలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ప్రభుత్వం దృష్టి
ఆలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొక్కిసలాటల నివారణకు ముందస్తు చర్యలకు మంత్రివర్గ ఉపసంఘం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులపై తీసుకున్న చర్యలపై పర్యవేక్షించాలని ఆదేశించింది. ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సభ్యులుగా మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ లను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దేవాదాయశాఖను ఆదేశించింది. ఈ మేరకు చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
Andhra Pradesh
Temple Security
Vandalism Prevention
Government Orders
Ministerial Sub Committee
YCP
ఆలయ రక్షణ
చట్టం మరియు శ్రేయస్సు
దేవాదాయ శాఖ
Scroll for the next article