News9th Nov 11:51 AMSunil Byrisetty1 min read
న్యాయవాదుల కుటుంబాలకు ప్రభుత్వం అండ
ఏపీలో న్యాయవాదుల సంక్షేమం పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 1150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు రూ.46 కోట్లు విడుదల
ఏపీలో న్యాయవాదుల సంక్షేమం పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 1150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు రూ.46 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను “ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్” పేరుతో విడుదల చేశారు. ప్రతి మరణించిన న్యాయవాది కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యతో ఆ న్యాయవాదుల కుటుంబాలకు కొంత ఊరట లభించనుంది.