News2nd Jan 05:05 PMSunil Byrisetty1 min read

రాజధాని పనుల్లో మరో కీలక అడుగు

రాజధాని అమరావతిలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు, నీరు నిల్వలు ఏర్పడకుండా ఉండేందుకు చేపడుతున్న వర

రాజధాని పనుల్లో మరో కీలక అడుగు
రాజధాని అమరావతిలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు, నీరు నిల్వలు ఏర్పడకుండా ఉండేందుకు చేపడుతున్న వరద నియంత్రణ చర్యల్లో భాగంగా, ఉండవల్లి గ్రామం వద్ద ‘పంపింగ్ స్టేషన్–2’ నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును జోన్–8 పరిధిలో నిర్మించనున్నారు. ఈ పంపింగ్ స్టేషన్ ద్వారా వరదల సమయంలో సుమారు 8,400 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి పంపించేలా డిజైన్ చేశారు. వర్షాకాలంలో రాజధాని ప్రాంతంలో నీటి ముంపు ఏర్పడకుండా ముందస్తు రక్షణ కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.
Amaravati
Capital Development
Flood Control
Pumping Station-2
Undavalli Village
ADCL
కృష్ణానది
వర్షనీరు నిర్వహణ
మౌలిక సదుపాయాలు
ప్రాణాపాయ నివారణ
Scroll for the next article