News13th Oct 12:10 PMSunil Byrisetty1 min read
కడుపులో దూది, పరికరం.. ప్రభుత్వం సీరియస్
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం ఓ బాలింత కడుపులో వైద్య పరికరం, దూది వదిలేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రసవం తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడం
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం ఓ బాలింత కడుపులో వైద్య పరికరం, దూది వదిలేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రసవం తర్వాత ఇంటికి వెళ్లిన ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ స్కానింగ్‌లో ఈ విషయం బయటపడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యుల సస్పెన్షన్ విధించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 'వంశీప్రియ, స్రవంతి'ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తీవ్ర కడుపు నొప్పితో 15 రోజుల పాటు బాలింత నరకయాతన అనుభవించారు. దీంతో మరోసారి శస్త్రచికిత్సతో పరికరాలను వైద్యులు తొలగించారు. అంతేకాకుండా గైనకాలజీ పీజీ 'ఉజ్వల'కు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. మరో పీజీ 'నాగశ్రీ'పై చర్యలు తీసుకోవాలని రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఆదేశాలు జారీ చేశారు.