News18th Aug 05:01 PMSunil Byrisetty1 min read
సింగ్‌నగర్‌లో రెండో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలి
విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీ జీరో అవర్
విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన రెండో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీ జీరో అవర్‌లో ప్రభుత్వాన్ని కోరారు. 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో సింగ్‌నగర్ ప్రాంతానికి తొలి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని తెలిపారు. 30 సంవత్సరాలు గడిచినా ఈ ప్రాంతానికి రెండో ఫ్లైఓవర్ నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 1.50 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని, ప్రతిరోజూ అవసరాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రజలకు ప్రస్తుత రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రెండో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించగా, రైల్వే శాఖ నుంచి సుమారు రూ.70 కోట్ల వ్యయం అవుతుందని సమాచారం వచ్చిందని బొండా ఉమ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.