News31st Dec 02:43 PMSunil Byrisetty1 min read
దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడితే ఉక్కుపాదం
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుందని బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలంతా సంత
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుందని బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలంతా సంతృప్తి వ్యక్తంచేస్తున్నారని, కాని జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రప్పా.. రప్పా.. అంటూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడే వారెవరూ లేరని అన్నారు. దౌర్జనాలు, బెదిరింపులకు పాల్పడేవారిపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని స్పష్టంచేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆమె స్వయంగా అందజేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంఛన్ గా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఒకటో తేదీన పండుగగాని, ఆదివారంగాని వస్తే ముందురోజే పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. గురువారం నూతన సంవత్సరం సంబరాలను దృష్టిలో పెట్టుకుని ముందురోజే నేడు(బుధవారం) పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.