News14th Dec 05:06 PMSunil Byrisetty1 min read
ప్రతి గింజ ధాన్యం కొంటాం
రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎక్కడ లేని విధంగా 24 గంటల్లో పైకం చెల్లిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలు
రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎక్కడ లేని విధంగా 24 గంటల్లో పైకం చెల్లిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్ర గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి జన్మదిన వేడుకలలో భాగంగా తొట్ల వల్లూరులో ప్రభుత్వ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తాను రైతు బిడ్డ అని, రైతుల కష్టాలు తెలుసని, రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతోనే తాను శనివారం కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించే ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం లాగా రైతులకు డబ్బులు ఎగ్గొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అనా పైసలతో సహా నిబంధనల ప్రకారం ప్రతి రైతు పండించిన పంటకు ధర చెల్లించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతులకు చెల్లిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు.
దాదాపు 20 వేల కోట్ల రూపాయల విధులను ధాన్యం డబ్బులు చెల్లింపు కోసం ముందుగానే సిద్ధం చేసుకున్నామన్నారు.