News28th Jun 11:50 AMSunil Byrisetty1 min read

నాలుగేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు

రాబోయే నాలుగేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. హౌసింగ్, విద్యుత్, ఆర్ డబ్

నాలుగేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు
రాబోయే నాలుగేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. హౌసింగ్, విద్యుత్, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతిస్తున్నదని, లేఅవుట్లపై ప్రభుత్వం ఇప్పటికీ కోట్లాది రూపాయలకు ఖర్చు చేసిందని, హౌసింగ్ అధికారులు గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి పేదలకు నివాసయోగ్యం చేయాలన్నారు. లేఅవుట్ల మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, ముందుగా విద్యుత్, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. పనులు మొదలైన వాటిని 100 శాతం పూర్తి చేయాలని, గ్రౌండ్ కానీ పనులను ప్రారంభించవద్దన్నారు. లేఔట్లు పూర్తి చేయడానికి స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. గతంలో అనర్హులకు ఇచ్చినట్లయితే వారిని తొలగించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు.
Andhra Pradesh news
visakhapatnam
Minister Kolusu Parthasarathy
Housing
Panchayat Raj
contractors
నాలుగేళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు
Scroll for the next article