News23rd Dec 10:59 AMSunil Byrisetty1 min read

గుంతలు లేని రోడ్లు ప్రభుత్వ సంకల్పం

మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి మెరుగైన రోడ్డు సదుపాయం కల్పించి తీరుతానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని

గుంతలు లేని రోడ్లు ప్రభుత్వ సంకల్పం
మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి మెరుగైన రోడ్డు సదుపాయం కల్పించి తీరుతానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని మూడు స్తంభాల నేషనల్ హైవే 65లో భాగంగా ఉన్న మూడు స్తంభాల సెంటర్ నుండి కోనేరు సెంటర్ వరకు ఉన్న 1.20 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. సుమారు రూ.1.38 కోట్ల వ్యయంతో 10 మీటర్ల వెడల్పులో రోడ్డును విస్తరించబోతున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి అభివృద్ధి నివేదికను సిద్ధం చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3.50 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో ప్యాచ్ వర్కులతో గుంతలు లేని రోడ్లు చేసి చూపించామని చెప్పారు.
Andhra Pradesh
Roads Development
Machilipatnam
NH 65
Kollu Ravindra
Infrastructure
Pothole-Free Roads
గుంతలు లేని రోడ్లు
కూటమి ప్రభుత్వం
ప్రజా పనులు
రోడ్డు విస్తరణ
Scroll for the next article