News16th Jul 03:19 PMSunil Byrisetty1 min read

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన గవర్నర్

కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేశారు. ఆయనతో మా

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన గవర్నర్
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.పవన్ స్వగృహంలో ఉన్న లైబ్రరీని గవర్నర్ తిలకించారు. లైబ్రరీలోని ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి పవన్ కళ్యాణ్ తో ఆసక్తిగా చర్చించారు. పవన్ కళ్యాణ్ కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ చేశారు.
Andhra Pradesh Governor
Pawan Kalyan
Abdul Nazeer
Deputy CM
Shoulder Surgery
Hyderabad
Janasena
ఏపీ రాజకీయాలు
ఆరోగ్య పరిస్థితి
తెలుగు వార్తలు
Scroll for the next article