News24th Jul 04:05 PMSunil Byrisetty1 min read

స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు గవర్నర్ నజీర్‌

గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కు విచ్చేసిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు ఘనంగా స్వాగతం లభించింది. తొలుత గవర్నర్ ట్రస్ట్ కు చేరుకోగానే ప

స్వర్ణ  భారత్ ట్రస్ట్‌కు గవర్నర్ నజీర్‌
గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కు విచ్చేసిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు ఘనంగా స్వాగతం లభించింది. తొలుత గవర్నర్ ట్రస్ట్ కు చేరుకోగానే పోలీసు గౌరవ వందనం స్వీకరించాక అధికారులు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వాగతం పలికి మొక్కలను అందజేశారు. అనంతరం శిక్షణ కేంద్రంలోని ప్లంబింగ్ శానిటరీ ప్రయోగశాల, విద్యుదీకరణ ప్రయోగ శాల, సౌరశక్తి శిక్షణ కేంద్రం, కారు మెకానిక్ శిక్షణ కేంద్రాలను పరిశీలించి అక్కడి శిక్షణార్థులతో కాసేపు ముఖాముఖి మాట్లాడి వారితో కలిసి ఫోటోలు దిగారు. కామినేని శ్రీనివాస్ ట్రస్ట్ కార్యకలాపాలను గవర్నర్కు వివరిస్తూ స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడతోపాటు హైదరాబాదు, నెల్లూరులో చాప్టర్లు ఉన్నాయన్నారు. శిక్షణా కేంద్రంలో గ్రామీణ మహిళలకు యువతకు, రైతులకు 40 రకాలకు పైగా అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 95 వేల మందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
Andhra Pradesh news
Swarna Bharat Trust
Governor S. Abdul Nazeer
Kamini Srinivas
Unguturu
Atkuru village
Skill Development
Youth Training
స్వర్ణ భారత్ ట్రస్ట్
గ్రామీణ మహిళల శిక్షణ
Scroll for the next article