News19th Dec 03:24 PMSunil Byrisetty1 min read

గుంటూరు జిల్లా కలెక్టర్ కు గవర్నర్ ప్రశంసలు

సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుంచి రూ.17,

గుంటూరు జిల్లా కలెక్టర్ కు గవర్నర్ ప్రశంసలు
సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుంచి రూ.17,67,363 సాయుధ దళాల పతాక నిధికి సేకరణ జరిగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి. ఈ మేరకు శుక్రవారం లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిల్లా కలెక్టర్ కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాయుధ దళాల పతాక నిధి సేకరణలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని చెప్పారు. సైనికులు వారి ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు. ప్రజలు అందరూ కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తున్నామని అందుకు కారణం సైనికుల త్యాగాలు అన్నారు. సైనికులు కుటుంబాలను వదిలి పెట్టీ దేశ సరిహద్దుల్లో సియాచిన్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం రక్షణగా నిలిచి దేశాన్ని రేయింబవళ్ళు కాపాడుతున్నారని చెప్పారు.
Andhra Pradesh
Guntur District
District Collector
A. Tameem Ansariya
Governor Praise
Justice Abdul Nazeer
Armed Forces Flag Fund
సాయుధ దళాల పతాక నిధి
అత్యధిక నిధుల సేకరణ
ఆంధ్రప్రదేశ్
ప్రజాసేవ
సైనికులకు గౌరవం
Scroll for the next article