Politics17th Aug 01:02 PMSunil Byrisetty1 min read

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరికే!?

ఏపీలో ఖాళీ అయిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కూటమి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. వెనుకబడిన వర్గాలకు ఆ స్థానాలు కేటాయించాలని నిర్ణయించింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరికే!?
ఏపీలో ఖాళీ అయిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కూటమి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. వెనుకబడిన వర్గాలకు ఆ స్థానాలు కేటాయించాలని నిర్ణయించింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఒక సీటు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరో స్థానాన్ని అనంతపురం జిల్ అంగన్ వాడీ విభాగం అధ్యక్షురాలు రమాదేవికి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న వర్ల రామయ్యకు గతంలోనే పదవులు దక్కాల్సి ఉన్నా, వివిధ సమీకరణాల వల్ల ఇవ్వలేకపోయామని అధిష్టానం గతంలో చెప్పింది. ఈ నేపథ్యంలో ఈసారి ఖాయమని చెబుతున్నారు. మరో స్థానంలో దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో మహిళా హక్కుల కోసం, అంగన్ వాడీ ప్రాజెక్టుల పురోగతి కోసంపని చేసిన రమాదేవిని ఎంపిక చేసినట్లు సమాచారం.
Andhra Pradesh
Varla Ramaiah
Ramadevi
Governor Quota MLC
TDP
Legislative Council
MLC Nominations
కూటమి ప్రభుత్వం
వెనుకబడిన వర్గాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Scroll for the next article