News8th Jul 02:22 PMSunil Byrisetty1 min read

ఆరునెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ!

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఎ

ఆరునెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఎపి ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో పేరెన్నికగన్న దిగ్గజ జిసిసి సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతూ... ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని చెప్పారు. టిసిఎస్, ఐబిఎం, ఎల్ అండ్ టి వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలోనే తొలిసారిగా ఎపి రాజధాని అమరావతిలో మరో ఆరునెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతోందని వివరించారు. ఇది భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందన్నారు. మరోవైపు విశాఖ మహానగరం ఐటి హబ్ గా తయారవుతోందని పేర్కొన్నారు.
Andhra Pradesh news
Amaravati
Quantum valley
technology hub
quantum valley declaration
Chandra Babu
ఆరునెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ
Scroll for the next article